ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకున్న సెరెనా విలియమ్స్

అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంది. US ఓపెన్ సెమీస్ లో వరల్డ్ నెంబర్ వన్ విక్టోరియా అజరెంకా చేతిలో సెరెనా ఓటమిపాలైంది. ఆ మ్యాచ్ లో మొదటి రౌండ్ లో సెరెనా దూకుడుగా ఆడింది. ఆ తర్వాత ఆమె ఎడమకాలికి గాయమైంది. ఆ తర్వాత చురుకుగా కదలలేకపోయింది. ఆ గాయం నుంచి కోలుకోకుండానే ఫ్రెంచ్ ఓపెన్ లో ఆమె అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే ఆమె గాయం తిరగబెట్టింది. దీంతో.. టోర్నీ నుంచి సెరెనా వైదొలగినట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఆరు వారాలు రెస్ట్ తీసుకోకతప్పదని తెలిపింది సెరెనా. ఈ ఏడాది మరో టోర్నీని కూడా ఆడనని చెప్పింది.

Latest Updates