క్లైమాక్స్ కి చేరిన శ్రావ‌ణి సూసైడ్ కేసు

హైద‌రాబాద్: సీరియల్ నటి శ్రావణి సూసైడ్ కేసు క్లైమాక్స్ కి చేరింది. నిందితులు దేవ్ రాజ్, సాయి కృష్ణల‌ను సోమ‌వారం ఉద‌యం అరెస్ట్ చేశారు పోలీసులు. ఇద్దరినీ కరోనా పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించిన‌ట్లు తెలిపారు పోలీసులు. ఎస్ అర్ నగర్ పోలీస్ స్టేష‌న్ ఎదురుగా ఉన్న కోవిఢ్ సెంటర్ లో కరోనా పరీక్షలు చేసిన త‌ర్వాత కోర్టులో ప్రొడ్యూస్‌‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించామని తెలిపిన పోలీసులు..సాయంత్రం మీడియా ముందుకు నిందితులును ప్రవేశ పెడుతామ‌న్నారు.

సాయి, దేవారాజు వేదించినట్లు ఆధారాలు ఉన్నాయని.. ఈ కేసులో ఇద్దరి ప్రమేయంపై ఆడియో కాల్స్, వీడియోలు ఉన్నాయన్నారు. సోమ‌వారం నిందితులను రిమాండ్ చేస్తామన్న పోలీసులు..శ్రావణి ఆత్మహత్య కేసులో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. వాటికి సంబంధించి టెక్నీకల్ ఏవిడెన్స్ సేకరించామని చెప్పారు పోలీసులు.

Latest Updates