సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం

  • చైనా నుంచి భారీగా పరిహారం వసూలు చేస్తాం
  • అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్ : కరోనా వ్యాప్తి కి సంబంధించి చైనా పాత్రపై సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ మహమ్మారి కారణంగా అత్యధికంగా నష్టపోయింది అమెరికానే. దాదాపు 10 లక్షలకు మందికి కరోనా సోకగా 56 వేల మందికి పైగా చనిపోయారు. అమెరికా ఇంతగా డ్యామేజ్ కావటానికి చైనా నిర్లక్ష్యమే కారణమని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీక్ అయ్యిందా లేదంటే కరోనా వ్యాప్తి లో చైనా నిర్లక్ష్యంగా వ్యవహారించిందా అన్న దానిపై అమెరికా విచారణ చేస్తోంది. సోమవారం వైట్ హౌజ్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ప్రపంచం సఫర్ అయ్యేందుకు డ్రాగన్ కంట్రీయే కారణమని చెప్పేందుకు చాలా ఆధారాలున్నాయన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి దాన్ని తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చైనా చేస్తోందంటూ ట్రంప్ ఆరోపించారు. కరోనా వ్యాప్తిని మొదట్లోనే అరికట్టే అవకాశం ఉన్నప్పటికీ చైనా చాలా నిర్లక్ష్యంగా వ్యవహారించిందని ట్రంప్ చెప్పారు.
జర్మనీ కన్నా ఎక్కువ పరిహారం అడుగుతాం
కరోనా తో అమెరికా ఫైనాన్సియల్ గా చాలా లాస్ అయ్యింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మళ్లీ ఆర్థికంగా సెట్ రైట్ అయ్యేందుకు మస్తు రోజులు పట్టనుంది. దీంతో అమెరికా తమకు వాటిల్లిన నష్టాన్ని చైనా నుంచి వసూలు చేయాలని భావిస్తోంది. జర్మనీ ఇప్పటికే కోరిన 130 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ పరిహారాన్ని అడిగాలని భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు.

Latest Updates