మళ్లీ మొదలైన ఆక్స్‌ఫర్డ్ క్లినికల్ ట్రయల్స్

సెప్టెంబర్ 11న భారత్‌లో ఆపేసిన ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌ను తిరిగి మొదలుపెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది. సెకండ్, థర్డ్ స్టేజ్ ట్రయల్స్ నిలిపివేయాలని ఇచ్చిన ఆదేశాలను డీజీసీఐ విత్ డ్రా చేసుకుంది. కాకపోతే.. మరిన్ని జాగ్రత్తలతో ట్రయల్స్‌ను కొనసాగించాలని ఆదేశించింది. అంతేకాకుండా స్ర్కీనింగ్ దశలో మరిన్ని జాగ్రత్తలను తీసుకోవాలని డీసీజీఐ సూచించింది. అదేవిధంగా వ్యాక్సిన్ ప్రయోగించిన వ్యక్తికి ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాటిపై డీప్‌గా అధ్యయనం చేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌ను ఆదేశించింది. అలాంటి అనారోగ్య సమస్యలు వస్తే.. ఇవ్వాల్సిన మెడిసిన్ లిస్ట్‌తో పాటు ట్రీట్మెంట్ రూల్స్‌ను కూడా మరోసారి తమకు సబ్మిట్ చేయాలని డీసీజీఐ కోరింది.

బ్రిటన్‌కు చెందిన డాటా అండ్ సేప్టీ మానిటరింగ్ బోర్డుతో పాటు భారత్‌కు చెందిన డీఎస్ఎంబీ కూడా టీకా క్లినికల్ ట్రయల్స్‌ను మళ్లీ ప్రారంభించేందుకు సిఫార్స్ చేయడంతో డీసీజీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆక్స్‌ఫర్డ్ టీకా సేప్టీయేనని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ తేల్చడంతో బ్రిటన్లో మళ్లీ ట్రయల్స్ మొదలుపెట్టారు. వాలంటీర్లకు సంబంధించిన వివరాలు, ల్యాబ్‌లు అనుసరిస్తున్న విధానాలు, ట్రయల్స్‌పై తీసుకుంటున్న జాగ్రత్తలను సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా మరోసారి డీసీజీఐకి పంపించింది. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వారం రోజుల పాటు వాలంటర్‌పై ఎలాంటి పరిశీలన ఉంటుందనే విషయాలపై ఎస్ఐఐ క్లారిటీ ఇచ్చింది. బ్రిటన్, ఇండియాలకు చెందిన డాటా అండ్ సేప్టీ మానిటరింగ్ బోర్డు సిఫార్సులతో పాటు సీరం ఇనిస్టిట్యూట్ ఇచ్చిన వివరాలను పరిగణలోకి తీసుకొని క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతించినట్లు డీసీజీఐ అధికారులు తెలిపారు.

For More News..

వీడియో: నదిలో పడవ మునిగి ఆరుగురు మృతి

మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ తండ్రి మృతి

ఇజ్రాయెల్‌పై ఒకే రాత్రి 15 రాకెట్ల దాడి

Latest Updates