కొవిషీల్డ్ ట్రయల్స్‌ నిలిపివేశాం: సీరం ఇన్‌‌స్టిట్యూట్

న్యూఢిల్లీ: కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. బుధవారం వ్యాక్సిన్ ట్రయల్స్‌ను ఆపేయాలని సీరం ఇన్‌స్టిట్యూట్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) షోకాజ్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రయల్స్‌‌కు సీరం విరామం ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌‌ను ఆస్ట్రా జెనెకా అనే యూకే కంపెనీతో కలసి సీరం ఇన్‌స్టిట్యూట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది.

‘మేం పరిస్థితిని రివ్యూ చేస్తున్నాం. ఇండియాలో ట్రయల్స్‌కు విరామం ఇస్తున్నాం. డీసీజీఐ నిబంధనలను పాటిస్తున్నాం. ట్రయల్స్‌పై ఇంకేం మాట్లాడలేం’ అని సీరం ఇన్‌స్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రాజెనెకా మిగతా దేశాల్లో ట్రయల్స్‌ను నిలిపేసిన విషయంపై తమకు సమాచారం ఇవ్వనందుకు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు డీసీజీఐ నోటీసులు జారీ చేసింది. యూకే బేస్డ్ ఆస్ట్రా జెనెకాకు చెందిన వ్యాక్సిన్ రెసిపింట్స్‌లో ఒక వ్యక్తి అనారోగ్యానికి గురవ్వడంతో ఆ కంపెనీ ట్రయల్స్‌ను ఈ నెల 8న ఆపేసింది.

Latest Updates