ఉద్యోగుల ప్రమోషన్ల సర్వీసు మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గింపు

రాష్ట్ర  ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. న్యూఇయర్ గిఫ్ట్ గా సాలరీలు, రిటైర్ మెంట్ ఏజ్ పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సీఎం…ప్రమోషన్ల విషయంలో కూడా ఇవాళ గుడ్ న్యూ అందించారు. ఉద్యోగుల ప్రమోషన్ల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేశారు సీఎం కేసీఆర్.

అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపడుతామని సీఎం కేసీఆర్ ఇది ఇదివరకే ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు కలిసి 9,36,976 మంది ఉంటారని…అందరికీ సాలరీల పెంపు వర్తిస్తుందని తెలిపారు. అంతేకాదు..ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు కూడా సాలరీలపెంపు వర్తిస్తుందని చెప్పారు. వీరితో గౌరవ వేతనాలు అందుకుంటున్న హోంగార్డులు, అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు, పెన్షనర్లకు అందరికీ పెంపుదల బెనిఫిట్ ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.

Latest Updates