రోహిత్ డకౌట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు

సౌతాఫ్రికాతో వామప్ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్  మ్యాన్ రోహిత్ శర్మ డకౌట్ కావడంతో సోషల్ మీడియాలో అతడిపై కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ శర్మ టెస్టుల్లో మరో డబుల్ సెంచరీ చేశాడంటూ సెటైర్లు వేస్తున్నారు. సౌతాఫ్రికాతో జరగిన వామప్ మ్యాచ్ లో రోహిత్ 2 బంతులు ఆడి ఫిలాండర్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. టెస్టుల్లో ఓపెనర్ రాహుల్ ఫెయిల్ అవడంతో రోహిత్ శర్మకు ఛాన్స్ ఇచ్చారు. వన్డే,టీ20 ఫార్మాట్లలో ఓపెనర్ గా ఇరగదీసే రోహిత్ శర్మ టెస్టులకు వచ్చే సరికి నిలకడగా ఆడలేకపోతున్నాడు. మొన్నటి వరకు మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేసిన రోహిత్ నిన్న జరిగిన వామప్ మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చాడు. కానీ డకౌట్ అందరిని నిరాశపరిచాడు రోహిత్.

Latest Updates