ఏడున్నర లక్షలతో కోటీశ్వరులయిన్రు

న్యూఢిల్లీ : కొన్ని షేర్లు కొందరికి భలే కలసి వస్తాయి. పది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. 10 వేలకు వెళ్లిపోవడం… వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే లక్షలు రావడం చూస్తుంటాం.. స్టాక్ మార్కెట్లు కుదేలవుతోన్న సమయంలో కూడా కొందరికి కోట్లు కురుస్తాయి. అలాంటిదే మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్. ఆర్థిక మాంద్యం, జీఎస్టీ, బీఎస్ 6 నార్మ్స్ వంటి పలు పరిణామాలతో ఇప్పటికే ఆటో సెక్టర్ కుదేలై ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఆటో సెక్టర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన మిండా ఇండస్ట్రీస్‌‌‌‌ కంపెనీ షేరు అయితే ఏకంగా వెయ్యి రెట్లకు పైగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ఈ కంపెనీలో రూ.ఏడున్నర లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పుడు  కోటీశ్వరులయ్యారు.

మిండా ఇండస్ట్రీస్ షేరు ధర ఐదేళ్ల క్రితం రూ.25 ఉంటే.. ఇప్పుడది రూ.336కు పెరిగింది. అంటే 1,244 శాతం పెరిగిందన్నమాట. ఇదే సమయంలో బీఎస్‌‌‌‌ఈ ఆటో ఇండెక్స్ మాత్రం ఫ్లాట్ రిటర్న్‌‌‌‌లనే ఇన్వెస్టర్లకు అందించింది. మిండా ఇండస్ట్రీస్ అనేది ఆటో కంపోనెంట్ స్పేస్‌‌‌‌లో ఇండియాలోనే టాప్ 5 ప్లేయర్స్‌‌‌‌లో ఒకటిగా ఉంది. ఫోర్ వీలర్ సెగ్మెంట్ కోసం కంపెనీ ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ సెక్యురిటీస్ సిస్టమ్స్, డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రానిక్ బాడీ కంట్రోలర్స్, స్టార్ట్ సిస్టమ్స్, పవర్ క్లోజర్ సిస్టమ్స్, ఎల్‌‌‌‌ఈడీ సాఫ్ట్ టచ్, కెమెరా మాడ్యుల్స్ వంటి వాటిని తయారు చేసి విక్రయిస్తోంది. టూవీలర్ సెగ్మెంట్ కోసం స్విచ్ కమ్ స్టీరింగ్ లాక్, ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్, లాచెస్ అండ్ కేబుల్,టూల్ బాక్స్,లాక్స్, ఇమ్‌‌‌‌మొబలైజర్, మాగ్నటిక్ మాడ్యుల్స్‌‌‌‌ను తయారు చేస్తోంది. ఈ కంపెనీ సేల్స్ 2014 ఆర్థిక సంవత్సరం నుంచి 2019 ఆర్థిక సంవత్సరం మధ్యలో 3.7 రెట్లు పెరిగి రూ.5,908 కోట్లుగా రికార్డయ్యాయి. లాభాలైతే 60 రెట్లు పెరిగి రూ.5.3 కోట్ల నుంచి రూ.320 కోట్లకు ఎగిశాయి.

ఈ స్టాక్ ధర పెరగడానికి సహకరించే అంశాలు…

ఆటో సెక్టార్‌‌‌‌‌‌‌‌లో సవాళ్లున్న సమయంలో కూడా ఈ కంపెనీ ఎంతో స్ట్రాంగ్‌‌‌‌గా నిలబడగలుగుతుందని చోళమండలమ్ సెక్యురిటీస్ చెప్పింది. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్ 6 నార్మ్స్ అమల్లోకి వస్తున్నాయి. ఈ నార్మ్స్ అమల్లోకి వస్తే.. ఇంజిన్ రిలేటెడ్ సెన్సర్లు, అడ్వాన్స్ ఫిల్ట్రేషన్, సీట్ బెల్ట్ రిమైండర్స్, ఎల్‌‌‌‌ఈడీ, అలోయ్ వీల్స్‌‌‌‌తోపాటు మరి కొన్ని ప్రొడక్ట్స్‌‌‌‌కు మరింత డిమాండ్ పెరగనుంది. ఈ మార్పులతో మిండా మరింత లాభాలను ఆర్జించనుంది. ఈ ప్రొడక్ట్‌‌‌‌ల విక్రయం కంపెనీకి అత్యధిక మార్జిన్లను అందించడంతో పాటు రెవెన్యూలను పెంచుకోవడానికి సహకరించనుందని బ్రోకరేజ్ అంచనావేస్తోంది.

Latest Updates