తీవ్ర విషాదం: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఓ ఆలయ ఉత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగిన ఘటనలో మొత్తం నలుగురు మహిళలతో సహా ఏడుగురు భక్తులు చనిపోయారు. మరో 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. తురైయూర్‌ సమీపంలోని ముత్యంపాలయంలో ఉన్న కరుప్పనస్వామి ఆలయంలో ఆదివారం ఉదయం 10:45 గం.లకు ఈ ఘటన చోటుచేసుకుంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ ఉత్సవంలో నాణేల పంపిణీ జరిగినప్పుడు క్యూలో ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో ఈ  ఘటన జరిగినట్టు సమాచారం. మృతి చెందిన వారు ఆర్.లక్ష్మీకాంతం (60), కె.రాజవేల్ (55), ఎస్.గాంధయీ (38) , ఎ.శాంతి (50), రామర్ (50), వి.పూంగవనం (50), ఆర్.వల్లి (35)గా గుర్తించారు. వీరంతా కరూర్, కడలూరు,సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందిన వారు.  గాయాలతో బాధపడుతున్న వారిని  తురైయూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Latest Updates