పెళ్లి వేడుక‌కు వెళ్లి వ‌స్తుండ‌గా.. రెండు ఆటోల‌ను ఢీకొట్టిన లారీ.. ఏడుగురి దుర్మ‌ర‌ణం

వివాహ వేడుక‌కు ముందు జ‌రిగే తిల‌క‌ధార‌ణ ఫంక్ష‌న్‌కు వెళ్లి వ‌స్తుండ‌గా.. రెండు ఆటోల‌ను లారీ ఢీకొట్ట‌డంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 12 మంది గాయాల‌పాల‌య్యారు. ఈ దుర్ఘ‌ట‌న బీహార్ లోని గ‌య జిల్లాలో జ‌రిగింది. సోమ‌వారం ఉద‌యం బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలోని బాలూగంజ్‌లో జ‌రిగిన బంధువుల పెళ్లి వేడుక‌కు గ‌య జిల్లాలోని విష్ణుపూర్ వాసులు రెండు ఆటోల్లో వెళ్లారు. పెళ్లికి ముందు జ‌రిగే తిల‌క‌ధార‌ణ వేడుక‌లో పాల్గొని తిరిగి స్వ‌స్థ‌లానికి బ‌య‌లుదేరారు. ఈ స‌మ‌యంలో ఎదురుగా వ‌స్తున్న ఓ లారీ వేగంగా ఆటోలను ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించారు. మ‌రో 12 మందికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని గ‌య ఎస్పీ రాజీవ్ మిశ్రా తెలిపారు. అతి వేగం కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నాకు వ‌చ్చిన‌ట్లు చెప్పారు.

Latest Updates