రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

రాజస్థాన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భిల్వారా జిల్లా కేశార్‌పూర్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఓ ట్రాలర్… వ్యాన్‌ను ఢీకోట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాన్‌ను ట్రాలర్ బలంగా ఢీకొట్టడంతో అది నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో వ్యాన్‌‌లోని ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు సింగోలీ గ్రామానికి చెందినవారు కాగా, ఒకరు సాలావటియాకు చెందినవారిగా గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న బిజౌలియా పోలీసులు వ్యానులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు త‌ర‌లించారు. మృతి చెందిన‌వారు ఉమేశ్‌(40), ముఖేశ్‌(23), జ‌యమ్నా(45), అమ‌ర్ చంద్‌(32), రాజు(21),రాధేశ్యామ్‌(56) ,శివాల్(40) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Latest Updates