ఏడు సినిమాలు నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌

  • త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి

ముంబై: సినిమా ఇండస్ట్రీకి రిలీజ్‌ కష్టాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా విధించి లాక్‌డౌన్‌ వల్ల మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లు మూతపడటంతో సినిమా రిలీజ్‌లు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాం ద్వారా రిలీజ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, యంగ్‌స్టార్‌‌ ఆయుష్మాన్‌ ఖురానా నటించిన ‘‘గులాబో సితాబో” సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఓటీటీ ద్వారా రిలీజ్‌ అయ్యే సినిమాల లిస్ట్‌ లోకి ఇప్పుడు మరో ఆరు పెద్ద సినిమాలు వచ్చి చేరాయి. మహానటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ నటించిన ‘పెంగ్విన్‌’(తమిళ్‌, తెలుగు) సినిమా కూడా అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా రిలీజ్‌ అవుతున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ నటించిన విద్యాబాలన్‌ నటంచిన ‘శకుంతల’, జ్యోతిక నటించిన “ పొన్మగల్‌ వంధల్‌’’ (తమిళ్‌), అదితీ రావ్‌ హైదరీ నటించిన“ సుఫియుం సుజతాయుం” (మళయాళం), రాగిని చంద్రన్‌, సిరి ప్రహ్లాద్‌ నటించిన ‘లా’ (కన్నడ), ‘‘ఫ్రెంచ్‌ బిర్యానీ” (కన్నడ) సినిమాలు నేరుగా ఆమెజాన్‌ ప్రైమ్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.

“ మేం ఇంకో అడుగు ముందుకు వేయబోతున్నాం. ఇండియాకు చెందిన ఏడు సినిమాలను ప్రైమ్‌ వీడియోలో రిలీజ్‌ చేస్తున్నాం. సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను వారి ఇంటి వద్దకే తీసుకొస్తున్నాం” అని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో డైరెక్టర్‌‌ అండ్‌ కంటెంట్‌ హెడ్‌ సుబ్రమణియం చెప్పారు. “ భారత దేశ జనాలు ఏడు సినిమాల రిలీజ్‌ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. వాటిని ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా అందిస్తున్నాం. ఇళ్లలోనే కూర్చొని ఇష్టం వచ్చిన స్క్రీన్‌ మీద, సేఫ్టీగా వాటిని చూడొచ్చు” అని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇండియా డైరెక్టర్‌‌, కంట్రీ జనరల్‌ మేనేజర్‌‌ గౌరవ్‌ గాంధీ అన్నారు. కాగా.. అమెజాన్‌ ప్రైమ్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని డిస్ట్రిబ్యూటర్లు తప్పుపట్టారు. అలా చేయడం సరికాదని అన్నారు. దీనిపై ఐనాక్స్‌ మూవీస్‌ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

సినిమా                                                     రిలీజ్‌ డేట్
పొన్మగల్‌ వంధల్‌                                           మే 29
గులాబో సితాబో                                           జూన్‌ 12
పెంగ్విన్‌                                                      జూన్‌ 19
లా                                                             జూన్‌ 26
ఫ్రెంచ్‌ బిర్యానీ                                              జులై 24
శకుంతల                                                   ప్రకటించాల్సి ఉంది
సుఫియుం సుజతాయుం                             ప్రకటించాల్సి ఉంది

Latest Updates