బైక్‌ పై ఏడుగురు..తోడుగా 2 కుక్కలూ..!

ఒకటి రెండు, మూడు, నాలుగు, ఐదు.. 24..లెక్కపెట్టే కొద్దీ దిగుతూనే ఉన్నారు ఆ ఆటోలో. అదే మొన్నా మధ్య ఒకే ఆటోలో 24 మందిని ఎక్కించు కొని వెళ్లిన వీడియో మన దగ్గర బాగా వైరల్‌‌‌‌ అయిందిగా. అట్లాగే మరోటి జరిగింది. కాకపోతే ఇది బైక్‌‌ ‌. మాములుగా అయితే బైక్‌‌‌‌ పైన ఎంత మంది వెళ్తారు? రూల్స్‌‌‌‌ ప్రకారం అయితే ఇద్దరు. ఇక రూల్స్‌ బ్రేక్‌ చేస్తే ముగ్గురు పోతుంటారు.

కానీ ఒక వ్యక్తి మాత్రం ఒక్కరు, ముగ్గు రు కాదు ఏకంగా ఏడుగురితో వెళ్లాడు. దానికితోడు రెండు కుక్కలనూ అందులో ఇరికించుకున్నాడు. ఆ వీడియోని ఓ వ్యక్తి ట్వి టర్‌‌‌‌‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌ చేశాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది మాత్రం ఆ వ్యక్తి చెప్పలేదు.

Latest Updates