3 రోజులు చదువు.. 3 రోజులు ఉద్యోగం

సెవెన్త్​ క్లాస్​ స్టూడెంట్​కు జాబ్

వారంలో 3 రోజులు చదువు.. 3 రోజులు ఉద్యోగం

నెలకు 25 వేల గౌరవ వేతనం

నార్సింగి, వెలుగు: అతి చిన్న వయసులోనే ఓ చిన్నారి సైంటిస్ట్ గా ఉద్యోగం సంపాదించాడు. మణికొండ కు చెందిన రాజా–మానస దంపతుల కుమారుడు సిద్ధార్థ్(12) మణికొండలోని ఓ ప్రైవేట్​ స్కూల్​లో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఐటీ ఉద్యోగులు. చిన్నప్పటి నుంచి కంప్యూటర్ పై ఆసక్తి కలగటంతో కొడుకుని పేరెంట్స్ కూడా ప్రోత్సహించారు. 4వ తరగతి చదువుతుండగా కంప్యూటర్ గేమ్స్ ఆడేవాడు. ఈ గేమ్స్​ఎలా రూపొందిస్తారన్న ఆలోచన వచ్చి కంప్యూటర్ భాషలైన సి, సి++, జావా, పైతాన్ వంటివి నేర్చుకున్నాడు. ఆరు నెలల్లో డేటా సైన్స్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయగా డిగ్రీ లేని కారణంగా తిరస్కరించారు. సిద్ధార్థ ఉత్సాహాన్ని గమనించిన మౌంట్ఇండియా కంపెనీవారు అతడికి ఉద్యోగం ఇచ్చారు. వారంలో మూడు రోజులు స్కూల్లో చదువుకుంటూ మిగిలిన మూడు రోజులు ఉద్యోగం చేయవచ్చు. నెలకు రూ.25 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నారు. స్కూల్ నుంచి ఇంతటి ఘనత సాధించిన సిద్ధార్థను టీచర్లు అభినందించారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates