ఏపీలో రేపటి నుంచి ఏడో విడత ఉచిత రేషన్ పంపిణీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్ చెప్పారు ఆ రాష్ట్ర సీఎం వైఎస్  జగన్మోహన్ రెడ్డి. ఉచితంగా ఏడో విడత రేషన్ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని రేప‌టి(శుక్రవారం,జులై-3) నుంచి ప్రారంభించ‌నున్నట్లు తెలిపారు. ఒక్కొక్క‌రికి 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు ఫ్రీగా అందించ‌నున్నట్లు చెప్పారు.

లాక్‌డౌన్ స‌మ‌యంలో ఉపాధి కోల్పోవ‌డంతో.. పేద‌ల‌కు ఉచితంగా బియ్యం, స‌రుకులు పంపిణీ చేస్తోంది ఏపీ సర్కారు. ఇప్ప‌టికే ఆరు విడత‌లుగా ఉచిత రేషన్ పంపిణీ చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో ఏడో విడ‌త కూడా పంపిణీకి సిద్ధ‌మ‌వుతున్నారు అధికారులు. శుక్రవారం నుంచి బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఉచిత రేషన్ పంపిణీతో రాష్ట్రంలోని 1.48 కోట్ల రేష‌న్‌ కార్డుదారుల‌కు లబ్ధి చేకూర‌నుంది.

Latest Updates