కంటి సమస్యలున్నోళ్లలో తెలంగాణకు ఏడో ప్లేస్​

  • మొదటిస్థానంలో పంజాబ్
  • కేంద్ర ఆరోగ్య శాఖ సర్వేలో వెల్లడి
  • రాష్ట్రంలో మహిళలు, రూరల్‌‌‌‌ ఏరియాలోనే ఎక్కువ
  • 45 ఏండ్లు పైబడిన వాళ్లలో 62% మందికి సమస్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లు రోజురోజుకు పెరుగుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్లు, రూరల్‌‌‌‌ ఏరియాలోని జనం ఐ ప్రాబ్లమ్స్‌‌తో ఇబ్బంది పడుతున్నారు. కంటి సమస్యలు ఉన్న వాళ్లలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగాఉన్నారు. ఇలా కంటి సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్లలో దేశంలో తెలంగాణ ఏడో ప్లేస్‌‌లో నిలిచింది. కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలో 45 ఏళ్ల పైబడిన వారిలో 62.2 శాతం మంది కంటిచూపు సరిగా లేక బాధపడుతున్నట్లు సర్వే చెప్పింది. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసున్న వారిలో 54.5% మంది, 60 ఏళ్ల ఆపైన వారిలో 71.8% మంది ఇబ్బంది పడుతున్నారంది. కంటి సమస్యలు ఎక్కువున్న వాళ్లలో దేశంలో పంజాబ్‌‌ ఫస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌(78.1 శాతం)లోఉందని వెల్లడించింది.

కాటరాక్ట్‌‌‌‌ఐ కేసర్‌‌‌‌ సర్వీసులు ప్లాన్‌‌ చేయాలి

చూపు సరిగా లేక ఇబ్బంది పడుతున్న వాళ్లలో పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారని సర్వే వెల్లడించింది. పురుషుల్లో 61.5% మంది ఈ ప్రాబ్లమ్స్‌‌తో ఇబ్బంది పడుతుంటే, మహిళల్లో 62.2% మంది బాధపపడుతున్నారంది. అలాగే అర్బన్​ ఏరియాలతో పోలిస్తే రూరల్​ ఏరియాల్లో ఎక్కువ మందికి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు తేలింది. రూరల్ ప్రాంతాల్లో 63.4% మంది, అర్బన్‌‌లో 59.9% ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటి సమస్యలు వచ్చినప్పుడు నాటు పద్ధతిలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకోవడం భవిష్యత్‌‌లో చూపు మసకబారేలా చేస్తోందని సర్వే చెప్పింది. ఆర్థిక పరిస్థితి బాగా లేని, చదువులేని వృద్ధుల కోసం కాటరాక్ట్ ఐ కేర్ సర్వీసులు ప్లాన్ చేయాలని సూచించింది.

క్యారెట్‌‌, ఆకుకూరలు, ఖర్జూర బాగా తినాలి

కంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు (మినరల్స్‌‌), లూటీన్‌‌, జియాగ్జాంతిన్స్​ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువుండే ఆకుకూరలు, గుడ్లు, స్వీట్‌‌ కార్న్‌‌ ఎక్కువగా తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. వీటి వల్ల వయసుతో పాటు వచ్చే కంటి వ్యాధుల్ని కూడా అదుపులో ఉంచవచ్చని పరిశోధనలు చెబుతున్నాయన్నారు. ముఖ్యంగా విటమిన్‌‌‌‌-సి, ఈ కళ్లకుఎంతో అవసరమని.. విటమిన్‌‌‌‌-ఎ, బీటా కెరోటిన్‌‌ ఎక్కువుండే క్యారెట్లు, ఆకుకూరలు, గింజలు, ఖర్జూర వంటివి రెటీనాకు రక్షణ కవచంలా పనిచేస్తాయని చెబుతున్నారు.

45 ఏళ్లు పైబడిన వాళ్లు గ్లకోమా చెకప్ చేసుకోవాలి

ప్రస్తుతకాలంలో లైఫ్ స్టయిల్ మారింది. తిండి కూడా సరిగా తినడం లేదు. వయస్సు 45 దాటితే దగ్గరి చూపు మెల్లగా తగ్గుతోంది. 45 ఏళ్ల పైబడిన వారు గ్లకోమా చెకప్ చేసుకోవాలి. బీపీ, షుగర్ వల్ల కూడా కంటి సమస్యలొస్తయి. డయాబెటిస్‌‌‌‌దీర్ఘకాలంగా ఉన్నవాళ్లు మెల్ల మెల్లగా చూపు కోల్పోతారు. డిజిటల్ డివైజెస్ రెటీనాను డ్యామేజ్ చేస్తాయి. తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆహారపు అలవాట్లు మారి..

చూపు తగ్గిపోవడానికి ఆహారపు అలవాట్లు మారిపోవడం, పోషకాల్లేని ఫుడ్ తీసుకోవడం, రాత్రుళ్లు ఎక్కువ సేపు పని చేయడం, సెల్‌‌ఫోన్ ఎక్కువగా వాడటం, లేట్‌‌నైట్ వరకు మేల్కొని ఉండటం, పెద్ద వాళ్లు పొగాకు నమలడం ప్రధాన కారణమని రిపోర్టు చెప్పింది. ప్రధానంగా కాటరాక్ట్, ప్రెస్బియోపియా (దగ్గరి చూపుపోవడం), మయోపియా (దూరం చూపు తగ్గడం), హైపర్​మెట్రోపియా (దగ్గర, దూరం రెండు), గ్లకోమా వంటివి ఇబ్బందికరంగా మారుతున్నాయని పేర్కొంది.

Latest Updates