దేశ సేవకు చాన్స్ ఇస్తేచాలు: ఆర్మీ నియామకాల్లో కశ్మీర్ యూత్

కశ్మీరీ యువత ఆకాంక్షలను చెప్పే వార్త ఇది. కశ్మీర్ లోని కొందరు కుర్రాళ్లను పక్కదారి పట్టించి.. విధ్వంసానికి వాడుకుటూ.. ఉగ్రమూకలు రెచ్చిపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మొన్నటి పుల్వామా ఉగ్రదాడి కూడా అలాంటిదే. స్థానికంగా ఉన్న ఉగ్ర సానుభూతి పరుల సహాయంతో…. సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు టెర్రరిస్టులు. మన సైన్యం, పోలీసులకు చిక్కకుండా… లోయలోని వీధుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు మరికొందరు. ఐతే.. కాయిన్ కు అది ఒక వైపు మాత్రమే. మరోవైపు.. ఇదిగో బారాముల్లాలో కనిపించిదీ ఈ సంఘటన. ఉద్యోగాల కోసం అక్కడియూత్ సర్టిఫికెట్లు పట్టుకుని ఎండలో నిలబడి ఎదురుచూస్తున్నారు. తమకు అవకాశం రావాలే కానీ.. దేశంకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు అక్కడి యూత్.

దేశానికి సేవ చేయడం కంటే మరేమీ ముఖ్యం కాదంటున్నారు కశ్మీర్ లోని యూత్. జమ్ముకశ్మీర్ లోని బారాముల్లాలో 111 ఆర్మీ ఖాళీల కోసం ఇవాళ నియామకాలు చేపట్టారు అధికారులు. ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం స్థానిక యూత్ ఆసక్తి చూపించారు. ఆర్మీలో ఉద్యోగం దక్కితే దేశానికి సేవ చేయొచ్చని బిలాల్ అహ్మద్ అనే కశ్మీరీ యువకుడు చెప్పాడు. ఉద్యోగంలో చేరితే.. కుటుంబాన్ని పోషించే అవకాశం కూడా తమకు దక్కుతుందన్నారు. ఒక కశ్మీరీ యువకుడిగా ఇంతకంటే ఇంకే ఆశించగలనని బిలాల్ అహ్మద్ అన్నాడు.

 

Latest Updates