కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూల్ కు పంపం: 4లక్షల పిటిషన్లు దాఖలు చేసిన పేరెంట్స్

కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే వరకు పిల్లల్ని స్కూల్ కు పంపమంటూ ఆన్ లైన్ లో 4లక్షల పిటిషన్లు దాఖలు చేశారు తల్లిదండ్రులు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో జులై లేదా ఆగస్ట్ నాటికి స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే స్కూల్స్ ప్రారంభం పై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలో జూలై చివరి లేదా ఆగస్టు నాటికి రాష్ట్రంలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. స్కూల్స్ ప్రారంభంపై  రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలన్న కేంద్రం సూచనల్ని తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు.  అంతేకాదు కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు పిల్లల్ని స్కూల్స్ కు పంపించేది లేదంటూ 4లక్షల మంది తల్లిదండ్రులు ఆన్ లైన్ లో పిటిషన్ దాఖలు చేశారు.

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకున్న స్కూల్స్ తెరవడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్ధించేది కాదు. వ్యాక్సిన్ వినియోగంలోకి రాకుండా పిల్లల్ని స్కూల్లకు పంపితే కరోనా తో పోరాటం చేయాలంటూ విద్యార్థి తల్లిదండ్రులు పిటిషన్ లో పేర్కొన్నారు.

ప్రస్తుత అకడమిక్ సెషన్స్ ను ఇ-లెర్నింగ్ మోడ్ లో కొనసాగించాలని పేరెంట్స్  పట్టుబడుతున్నారు. స్కూల్ క్యాంపస్‌లో సోషల్ డిస్టెన్స్ పాటించడం చాలా కష్టం. స్పోర్ట్స్ రూమ్, లైబ్రరీ, క్యాంటిన్ వంటి సాధారణ ప్రాంతాల్లో పరిమితులు చాలా అవసరం. స్కూళ్లల్లో సోషల్ డిస్టెన్స్ పై నిరంతరం నిఘా పెట్టాలి. దీంతో పిల్లల్లో అ భద్రతా భావం ఏర్పడుతుందని ఓ విద్యార్థి తండ్రి రాధాకృష్ణన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పిల్లల్ని స్కూల్ కి పంపిస్తే నా బిడ్డకి కరోనా రావచ్చు. అది నేను గుర్తించ లేకపోతే అప్పుడు మా అమ్మాయిని ఎవరు చూసుకుంటారని మరో విద్యార్ధిని తల్లి ప్రియాంక అన్నారు.

అయితే ఈ పిటిషన్ లపై ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేశ్ కుమార్ స్పందించారు. జూన్ 12నాటికి తల్లిదండ్రుల్ని సంప్రదిస్తామని, వారి నిర్ణయం మేరకు స్కూల్స్ ప్రారంభం పై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Latest Updates