మానవత్వం చాటుకుంటున్న తబ్లిఘి జమాత్ సభ్యులు

ప్లాస్మాను దానం చేసేందుకు సిద్ధమయ్యారు తబ్లిఘి జమాత్ సభ్యులు. మార్చి నెలలో జరిగిన తబ్లిఘి జమాత్ కార్యక్రమంలో అనేక మందికి కరోనా వైరస్ సోకింది. అయితే వారిలో పలువురికి వైరస్ పూర్తిగా తగ్గింది. కోలుకున్న సభ్యులు మిగిలిన బాధితుల్ని కాపాడేందుకు ప్లాస్మాను దానం చేసి మానవత్వం చాటుకుంటున్నారు.

మౌలానా సాద్ విజ్ఞప్తికి స్పందన

తబ్లిఘి జమాత్ నాయకుడు మౌలానా సాద్ చేసిన విజ్ఞప్తితో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న సభ్యులు ప్లాస్మాను దానం చేసేందుకు తమిళనాడు, ముంబై, బీహార్, మధ్యప్రదేశ్‌ ప్రాంతాలకు చెందిన సభ్యులు ముందుకు వచ్చారు. వైరస్ బాధపడుతున్న 300మందిని రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు చెప్పారు.

అల్లా నా ప్రాణాన్ని రక్షించాడు.

తబ్లిఘి జమాత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మర్చి 21న ఢిల్లీకి వచ్చాను. మార్చి 23న కరోనా టెస్ట్ ల కోసం  రాజీవ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. టెస్టుల్లో పాజిటీవ్ వచ్చింది. ఏప్రిల్ 19న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా. వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నా. అల్లా నా ప్రాణాల్ని రక్షించాడు. ఇతరుల ప్రాణాల్ని రక్షించేందుకు ప్లాస్మాను  దానం చేసినట్లు  తమిళనాడుకు చెందిన 42 ఏళ్ల ఫరూక్ బాషా తెలిపారు.

ఆరోగ్యంగా ఉన్నాను.

నేను చాలా సంవత్సరాలుగా తబ్లిఘి జమాత్‌ తో సంబంధాన్ని కొనసాగిస్తున్నాను. గత నెలలో తబ్లిఘి సమావేశాలకు హాజరయ్యాను. కరోనా వైరస్ సోకడంతో ట్రీట్ మెంట్ తీసుకున్నా. ఇప్పుడు వైరస్ పూర్తిగా తగ్గింది. వైరస్ నుంచి పేదల్ని కాపాడేందుకు నా ప్లాస్మాను దానం చేశా. ఆరోగ్యంగా ఉన్నా. ఎలాంటి సమస్యలేదన్నారు ఫరూక్ భాష సహచరుడు 45ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్ .

వీరితో పాటు మరికొంతమంది

ఫరూక్, అబ్దుల్ తో పాటు మరికొంతమంది ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. తమ సహచరులు ఎంతో మంది కరోనాతో బాధపడుతున్నారని, వైరస్ పూర్తిగా తగ్గాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కరోనా తగ్గిన వాళ్లు ప్లాస్మాను దానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Latest Updates