కన్న తండ్రే కూతుళ్ళపై లైంగిక వేధింపులు

సూర్యాపేట జిల్లా: కూతుళ్ళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కన్న తండ్రిని సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు.  వివాహితురాలైన కూతురు… భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి వచ్చి ఉంటోంది.  టైలరింగ్ పనిచేస్తున్న తండ్రి షేక్ సుభానీ… ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు కుటుంబసభ్యులు ఆరోపించారు.

ఏడో తరగతి చదువుతున్న మరో కూతురుని కూడా వేధిస్తుండటంతో తల్లితో కలసి పెద్ద కూతురు పోలీసులను ఆశ్రయించింది.  పోలీసులు నిందితుడిని ఫోక్సో, IPC 354 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకి పంపారు.

Latest Updates