పోలీసులు, విద్యార్ధి సంఘాల మధ్య ఘర్షణ.. పాఠశాలలో ఉద్రిక్తత

కేరళలోని వయనాడ్ జిల్లా సుల్తాన్ బథేరి ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్ధిని పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. ఐదవ తరగతి చదువుతున్న శహ్లా షెరీన్(10) ను క్లాస్ రూమ్ లోనే పాము కాటేయగా.. టీచర్ల నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్లడంలో ఆలస్యం జరిగింది. దీంతో ఆ చిన్నారి చికిత్స అందకుండానే కన్ను మూసింది.

కాగా.. బాలిక మృతి చెందిన ఘటనపై విద్యార్ధి సంఘాలు భగ్గుమన్నాయి. కనీస ప్రమాణాలు పాటించకుండా, సరైన వసతులు లేకుండా విద్యార్ధులకు పాఠాలు ఎలా చెబుతున్నారని పాఠశాల ఉపాధ్యాయులపై మండిపడ్డాయి. శుక్రవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టాయి. పాఠశాల లో ఫర్నీచర్ ను ధ్వంసం చేయబోయారు విద్యార్ధి సంఘాలు. ఈ క్రమంలో పాఠశాలకు రక్షణగా ఉన్న పోలీసులకు, విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అక్కడ పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులపై ఎలాంటి దాడి జరగకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Read More – టీచర్ల నిర్లక్ష్యం.. క్లాస్ రూమ్ లో పాము కరచి విద్యార్ధిని మృతి

ఈ ఘటనకి సంబంధించి స్కూల్ ప్రిన్సిపాల్ & వైస్ ప్రిన్సిపాల్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పబ్లిక్ ఎడ్యుకేషన్ (అకాడెమిక్) అదనపు డైరెక్టర్ జరిగిన సంఘటనపై   డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నిర్వహించి, ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు.

Latest Updates