వాన కాలం పంట కొనవు.. యాసంగిలో ఏ పంట వేయాలో చెప్పవు

వాన కాలం పంట కొనవు.. యాసంగిలో ఏ పంట వేయాలో చెప్పవు

రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ధాన్యం కుప్పలపై రైతులు పడుకొని అట్లనే చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో.. రైతులు పరేషాన్ అవుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను 6 వేల వరకు తెరుస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం.. సగం కూడా ఓపెన్ చేయలేదన్నారు. ధర్నా చౌక్ దగ్గర కేసీఆర్ ధర్నా చేయడం సిగ్గు చేటన్నారు. పాలన చేయరాకుంటే.. ఇంటికి పోవాలన్నారు.

వాన కాలం పంట కొనవు.. యాసంగి లో ఏ పంట వేయాలో చెప్పడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు. ముందు పంటలు కొను.. ధర్నాలు తర్వాత చెయ్ అని అన్నారు షబ్బీర్ అలీ.