షాద్ నగర్ లో కలకలం.. అంత్యక్రియల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్  లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. రెండో రోజుల క్రితం షాద్ నగర్ లో కరోనా వచ్చిన యువకుడిని అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ కు తలించారు. అతనితో కాంటాక్ట్ అయిన మరో 22మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారిలో ఒకరికి కరోనా సోకినట్లు తేలింది. మిగిలిన 21మంది టెస్ట్ ల రిజల్ట్ రావాల్సి ఉంది. అయితే షాద్ నగర్ బాధితులు..వారం రోజుల క్రితం  హైదరాబాద్ జియా గూడా లో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.  బాధితుడు  కరోనాతో సోకి మరణించాడని, అంత్యక్రియల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోవడంతో వారితో కరోనా సోకినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ అంత్యక్రియల్లో పాల్గొన్న వారితో పాటు..వారితో కాంటాక్ట్ అయిన వారికి వైద్యులు కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు.

Latest Updates