కరోనా వచ్చిందని ఆస్పత్రికి పంపి… 55 కి.మీ. నడిపించిన్రు

బలవంతంగా గాంధీకి పంపితే నో పాజిటివ్ రిజల్ట్స్

పద్మారావునగర్(హైదరాబాద్), వెలుగు: నీకు కరోనా సోకింది.. అంటూ ఓ పదిమంది బలవంతంగా 108లో గాంధీకి పంపగా, తీరా అతడికి
కరోనా లక్షణాలు లేవని డాకర్లు తేల్చడంతో 55 కి.మీ. నడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. షాద్ నగర్ కు చెందిన గోపికృష్ణ(45)కు కరోనా సోకిందని అనుమానించిన దాదాపు పది మంది 108కు ఫోన్ చేసి బలవంతంగా గాంధీకి పంపించారు. డాకర్లు అతడిని పరిశీలించి ఎలాంటి కరోనా లక్షణాలు లేవంటూ తిప్పి పంపారు. ఎలాంటి ట్రాన్స్పోర్టు లేకపోవడంతో 55 కి.మీ. దూరంలోని తన ఊరుకు నడుచుకుంటూ వెళ్లాడు. తనకు కరోనా లేకున్నా కొందరు గాంధీకి పంపించి ఇబ్బంది పెట్టారని, ఇదెక్కడి న్యాయమని బాధితుడు వాపోయాడు.

For More News..

ఐడీ కార్డు చూపించినా.. ఇష్ట మొచ్చినట్టు కొట్టిన్రు

లాక్‌‌డౌన్‌‌ ఉన్నా బయట తిరుగుతున్న బస్తీ జనాలు

కరోనా వచ్చిందని 55 కి.మీ. నడిపించిన్రు

రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

Latest Updates