షారూక్, బ్రావో లుంగీ డ్యాన్స్ చూశారా..!

షారూక్ ఖాన్ వెస్టిండీస్ ఆటగాడు బ్రావో తో కలిసి లుంగీ డ్యాన్స్ కు స్టెప్పులేశాడు.  ఈ వీడియోను బ్రావో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్ లో  కరీబియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. షారూక్ ఖాన్ టీం ట్రిన్ బాగో నైట్ రైడర్స్ కు యాజమాని. ఈ టీం  వరుసగా మూడో విక్టరీ సాధించింది. ఈ జట్టుకు పోలార్డ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా జట్టు సభ్యులకు షారూక్ ఖాన్ ఓ పడవలో పార్టీ ఇచ్చాడు. ఇందులో చెన్నై ఎక్స్ ప్రెస్ లోని ఫేమస్ సాంగ్ లుంగీ డ్యాన్స్ పాటకు షారూక్,బ్రావో ఇద్దరు కాసేపు స్టెప్పులేసి అక్కడున్న వారిని ఉత్సాహ పరిచారు.

 

Latest Updates