మేడమ్‌ టుస్సాడ్స్‌లో షాహిద్‌

ప్రతిష్టాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ సంస్థ నిర్వాహకులు సెలబ్రెటీల మైనపు విగ్రహాలను తయారు చేసి… ప్రజల సందర్శన కోసం సింగపూర్‌లోని మ్యూజియంలో ఉంచుతున్నారు. ఇటీవల బాలీవుడ్‌కి చెందిన సెలబ్రెటీలు ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పదుకుణే, కరణ్‌ జోహార్‌ మైనపు విగ్రహాలని ఆవిష్కరించారు. ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి రీమేక్‌ చిత్ర హీరో షాహిద్‌ కపూర్‌ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని షాహిద్‌ స్వయంగా తెలిపాడు. వారం రోజుల్లో తన విగ్రహాన్ని సింగపూర్‌లో ఆవిష్కరించనున్నారని తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అర్జున్‌ రెడ్డి రీమేక్‌ సినిమా కబీర్‌ సింగ్‌తో షాహిద్‌ బిజీగా ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా  కైరా అద్వాని నటిస్తోంది. జూన్‌ 21న ఈ మూవీని విడుదల చేయనున్నారు.

 

Latest Updates