నాలుగుసార్లు ఏడ్చా!

‘అర్జు న్‌ రెడ్డి’ రీమేక్‌ లో నటించి బ్లా క్‌ బస్టర్ కొట్టాడు షాహిద్ కపూర్. ఆ తర్వాత ‘జెర్సీ’ రీమేక్‌ కి కమిటయ్యాడు. దాంతో అతడు కావాలనే రీమేక్స్ చేస్తు న్నాడని చాలామంది కామెంట్ చేస్తు న్నారు. ఈ విషయంపై రీసెంట్‌‌గా స్పందించాడు షాహిద్. ‘జెర్సీ’ చేయడానికి తాను ఎందుకు ఒప్పుకున్నాడో వివరంగా చెప్పాడు. నిజానికి వెంటవెంటనే రీమేక్ చేయకూడదనే అనుకున్నాడట. కానీ ‘జెర్సీ’ మూవీ చూశాక మనసు మార్చుకున్నాడట. ‘సినిమా చూస్తు న్నప్పుడు నేను చాలా కదిలిపోయాను. నాలుగుసార్లు ఏడ్చేశాను. క్రికెట్‌‌ చుట్టూ తిరిగే కథే కావచ్చు. కానీ ముప్ఫయ్యారేళ్ల వ్యక్తి తన కొడుకు కోసం పడే తపన చూసి మనసంతా అదోలా అయిపోయింది. క్రికెట్ ఆడాలనున్నా ఆడలేడు. ఆడకూడదని తెలిసినా ఆడకుండా ఉండలేడు. నా వయసు ముప్ఫై ఎనిమిది. నేను కూడా చాలాసార్లు బ్లా క్ బస్టర్ మూవీస్ చేయలేకపోతున్నానే, ఇక నటించడం అవసరమా, వేరే ఏదైనా పని చేసుకుందా మా అని ఆలోచిస్తుంటా ను. అందుకేనేమో ఆ కార్యక్టర్ తో బాగా కనెక్టయ్యాను’ అని చెప్పాడు షాహిద్. హీరోది ఓ ఇన్‌ స్పైరింగ్ జర్నీ అని, అందుకే ఆ పా త్ర చేసి తీరాలని డి సైడయ్యానని అంటున్నాడు. తన నటనతో నా ని నిజంగానే గుం డెల్ని పిండేశాడు. మరి షాహిద్ ఆరేంజ్‌లో చేస్తాడా లేదా అనేది చూడాలి.

 

Latest Updates