ముద్దులు కాకుండా ఇంకేదైనా అడుగు

shahid-sharp-cut-dialogue-on-kabir-singh-kiss-scenes

రిపోర్టర్ V/s కబీర్ సింగ్

కబీర్ సింగ్ మూవీలో ముద్దులెన్ని అనే ప్రశ్న అడిగిన రిపోర్టర్ కు పంచ్ ఇచ్చారు మూవీ హీరో షాహిద్ కపూర్. కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ముంబైలో గ్రాండ్ గా జరిగింది. తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డికి ఇది హిందీ రీమేక్. మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. సినిమాలో ముద్దు సీన్లు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాయి.

ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ కియారా అద్వానీని ఓ రిపోర్టర్ పలు ప్రశ్నలడిగాడు. సినిమాలో ముద్దులెన్ని అడి అడిగితే… సినిమా చూసి తెల్సుకోండి అని ఆమె బదులిచ్చింది. పదే పదే ఇదే ప్రశ్న అడగడంతో.. షాహిద్ కపూర్ తన కంట్రోల్ కోల్పోయి కొంత సీరియస్ గా బదులిచ్చాడు. “నీకు గాళ్ ఫ్రెండ్ లేనట్టుంది. ఎన్ని ముద్దులున్నాయో తెల్సుకోవాలంటే డబ్బులు పెట్టి సినిమా చూడు. అదొక్కటి చూడటానికే టికెట్ కొనుక్కోవాలని నేను చెప్పడం లేదు. అది నువ్వు అనుకుంటున్నావంతే. ముద్దు సీన్ల గురించే పదేపదే ఎందుకడుగుతారు. సినిమాలో చాలామంది నటించారు కూడా. ఈ విషయం తెలుసా” అని కటువుగా సమాధానం చెప్పాడు షాహిద్ కపూర్.

Latest Updates