దుర్గామాత పూజలో పాల్గొన్న క్రికెటర్ ను నరికేస్తానంటూ బెదిరింపులు

బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్‌ అల్‌ హసన్ క్షమాపణలు చెప్పారు. క్రికెటర్ షకీబ్ దసర పండుగ సందర్భంగా కోల్ కత్తాలో దుర్గామాత పూజల్లో పాల్గొన్నారు.  ఈ పూజలపై ముస్లిం మత పెద్దలు,నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు షకీబ్ ను కత్తితో నరికి ముక్కలు చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై షకీబ్ స్పందించారు. కోల్ కత్తాలో జరిగిన దుర్గామాత పూజల్లో పాల్గొనాలంటూ మేయర్ ఫిర్హద్ హకీమ్ పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఆహ్వానం ప్రకారం తాను కోల్ కత్తాకు వెళ్లినట్లు చెప్పిన క్రికెటర్ … కాళీ మాత ఉత్సవాల్ని తాను ప్రారంభించలేదని స్పష్టం చేశారు. ముస్లిం మతాన్ని గౌరవిస్తానని, ఆచారాల్ని, సాంప్రదాయాల్ని పాటిస్తామని చెప్పారు. కాగా బంగ్లాదేశ్ కు చెందిన ఈ స్టార్ క్రికెటర్ 2సంవత్సరాల పాటు క్రికెట్ ఆడకుండా ఐసీసీ బ్యాన్ విధించింది. ఇండియాకు చెందిన బుకీతో సంప్రదింపులు జరిపినట్లు తేలడంతో ఐసీసీ బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 22తో షకీబ్ పై విధించిన బ్యాన్ ముగిసింది.

Latest Updates