మొదటి భర్తతో జంప్:  9 ఏళ్ల కూతురి గొంతు పిసికి చంపిన తల్లి

చిన్న పిల్ల అని కూడా చూడకుండా గొంతు పిసికి చంపింది ఓ సవతి తల్లి. ఈ దారుణం అమెరికాలో జరిగింది. శామ్ దాయ్ అర్జున్ (55) అనే ఆమె సుఖీందర్ సింగ్ ను రెండో పెళ్లి చేసుకుంది. వీరు అమెరికాలోని న్యూయార్క్  క్యూయిన్స్ లో నివసిస్తున్నారు. సుఖీందర్ సింగ్ కూతురైన 9 ఏళ్ల ఆశ్ దీప్ కౌర్ ను బాత్ టబ్ ముంచి చంపింది శామ్ దాయ్.

పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2016 వ సంవత్సరంలో ఆశ్ దీప్ కౌర్ తన తండ్రి ఐన సుఖీందర్ సింగ్ దగ్గర ఉండటానికి ఇండియా నుండి అమెరికా వెళ్లింది. అయితే తన రాకను వ్యతిరేకించిన శామ్ దాయ్ చివరికి కౌర్ ను గొంతు పిసికి చంపేసింది.

అగస్ట్ 19 2016 నాడు.. శామ్ దాయ్ తన మాజీ భర్త.. రేమాండ్ నారాయన్, అతని ఇద్దరు మనుమలతో కలిసి బయటకు వెళ్తుంది. దీంతో పక్క ఇంటికి చెందిన ఒకతను ఆశ్ దీప్ కౌర్ ఇంట్లో ఉందా అని శామ్ దాయ్ ను అడిగాడు. ఆశ్ దీప్ కౌర్ స్నానం చేస్తుందని.. వాళ్ల నాన్న తో బయటకు వెళ్లడానికి రెడీ అవుతుందని చెప్పింది. అయితే రెండు గంటలైనా బాత్ రూం లోని లైటు ఆఫ్ అవకపోవడంతో పక్కింటి వ్యక్తి సుఖీందర్ సింగ్ కు కాల్ చేశాడు. దీంతో సుఖీందర్ సింగ్ తాను తన కూతురితో బయటికి వెళ్లడం అబద్ధమని.. బాత్ రూం డోర్ ను పగులకొట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకోమని పక్కింటి అతన్ని కోరాడు.

తలుపులు పగులకొట్టి చూడటంతో ఆశ్ దీప్ కౌర్… బాత్ టబ్ లో నగ్నంగా నడి ఉండటాన్ని గమనించాడు. దీంతో అర్జెంట్ గా హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. అప్పటికే ఆశ్ దీప్ చనిపోయినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఇది మామూలు డెత్ కాదని ఎవరో గొంతు పిసికి చంపారని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. దీంతో..  శామ్ దాయ్ ను పోలీసులు విచారించగా తానే ఆశ్ దీప్ ను చంపినట్లుగా ఒప్పుకుంది. కేసును విచారిస్తున్న న్యూయార్క్ కోర్టు సోమవారం శామ్ దామ్ కు జీవితకాలం జైలు శిక్షను విధించింది.