కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కామెంట్స్‌‌ను బీజేపీ ఖండించింది. బిహార్ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ ఆ పార్టీ చీఫ్ జేపీ న‌డ్డా విమర్శించారు. జ‌మ్మూ కాశ్మీర్‌లో ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడేందుకు కేంద్ర సర్కార్ క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆయన స్పష్టం చేశారు. ‘బిహార్ ఎన్నికల్లో ప్రచారానికి కాంగ్రెస్ వద్ద ఎలాంటి ఎజెండా లేదు. అందుకే ఇండియాను విభజించాలనే తమ చెత్త వ్యూహాన్ని తిరిగి వాడుతోంది. రాహుల్ గాంధీ పాకిస్తాన్‌‌ను పొగుడుతున్నారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు చిదంబరం చెబుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటు’ అని నడ్డా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌‌కు ఆర్టికల్ 370 పునరుద్ధరణ గురించి చిదంబరం చేసిన వ్యాఖ్యల ట్వీట్‌‌ను జత చేశారు.

Latest Updates