వరల్డ్ బెస్ట్ ఎయిర్ పోర్ట్స్ లో మన శంషాబాద్

హైదరాబాద్‌‌‌‌లోని రాజీవ్‌‌‌‌గాంధీ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు (శంషాబాద్‌‌‌‌) మరోసారి సత్తా చాటింది. ప్రపంచంలోని అత్యుత్తమ 10 విమానాశ్రయాల్లో చోటు సంపాదించింది. ఎయిర్‌‌‌‌ హెల్ప్‌‌‌‌ సంస్థ ఇచ్చిన ర్యాంకింగ్‌‌‌‌లో 8వ స్థానంలో నిలిచింది. జాబితాలో హమద్ ఎయిర్‌‌‌‌పోర్టు టాప్‌‌‌‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో టోక్యో, ఏథెన్స్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులు చోటు దక్కించుకున్నాయి. 2015 నుంచి ఇవే ముందు వరుసలో ఉంటున్నాయి. పోర్చుగల్‌‌‌‌లోని లిస్బన్‌‌‌‌ పొర్టెలా ఎయిర్‌‌‌‌పోర్టు చివరి స్థానంలో(132) ఉంది. విమాన ప్రయాణికుల హక్కులు, విమానాలు ఆలస్యం, రద్దయినపుడు పరిహారం ఇప్పించే ఎయిర్‌‌‌‌ హెల్ప్‌‌‌‌ 40 దేశాల్లోని 132 ఎయిర్‌‌‌‌పోర్టులకు ర్యాంకులిచ్చింది. వన్‌‌‌‌టైమ్‌‌‌‌ పెర్ఫార్మెన్స్‌‌‌‌, సర్వీస్‌‌‌‌ క్వాలిటీ, ఫుడ్‌‌‌‌ అండ్‌‌‌‌ షాపింగ్‌‌‌‌ ఆప్షన్స్‌‌‌‌ ఆధారంగా మార్కులేసింది. వన్‌‌‌‌టైమ్‌‌‌‌ పెర్ఫార్మెన్స్‌‌‌‌కు 60 శాతం, సర్వీస్‌‌‌‌ క్వాలిటీ, ఫుడ్‌‌‌‌ అండ్‌‌‌‌ షాపింగ్‌‌‌‌లకు 20 శాతం చొప్పున వాటా ఇచ్చింది. తన సొంత డేటాబేస్‌‌‌‌, ఇతర వెండర్ల అభిప్రాయాలు, 40 వేల మంది ప్రయాణికులను సర్వే చేసి ఎయిర్‌‌‌‌హెల్ప్‌‌‌‌ ఈ ర్యాంకులు ప్రకటించింది.

అమెరికా చెత్త ప్రదర్శన

అమెరికా ఎయిర్‌‌‌‌పోర్టులు ఈ సారి చెత్త ప్రదర్శన కనబరిచాయి. యూఎస్‌‌‌‌లో హార్ట్స్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ జాక్సన్‌‌‌‌ అట్లాంటా ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టుదే టాప్‌‌‌‌ ర్యాంకు. ఇది టాప్‌‌‌‌ 30లో కూడా లేదు. 132 ఎయిర్‌‌‌‌పోర్టుల్లో దీని స్థానం 34. నెవార్క్‌‌‌‌ లిబర్టీ ఎయిర్‌‌‌‌పోర్టుకు అక్కడి విమానాశ్రయాల్లో చివరి(116) ర్యాంకొచ్చింది. వీటన్నింటికీ ముఖ్య కారణం వాతావరణ సమస్యలేనని ఎయిర్‌‌‌‌ హెల్ప్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ హెన్రిక్‌‌‌‌ జిల్‌‌‌‌మెర్‌‌‌‌ వెల్లడించారు. జాన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ కెన్నడీ ఎయిర్‌‌‌‌పోర్టులో కొద్దిగా మంచు కురిసినా మూసేస్తారని, దీనికి ఈసారి 86వ ర్యాంకొచ్చిందని వివరించారు. యూఎస్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టుల్లో లాంగ్‌‌‌‌ సెక్యూరిటీ కూడా మరో సమస్యన్నారు. ఇక ఫ్లైట్‌‌‌‌ ఇండస్ట్రీ ఏడాదికేడాది ఊపందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య 2018లో 6 శాతం పెరిగిందని, ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 100 కోట్లుగా ఉందని వరల్డ్‌‌‌‌ టూరిజం ఆర్గనైజేషన్‌‌‌‌ వెల్లడించింది.

టాప్‌‌‌‌ 10 బెస్ట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులు

 1. హమద్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, ఖతర్‌‌‌‌
 1. టోక్యో ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, జపాన్‌‌‌‌
 1. ఏథెన్స్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, గ్రీస్‌‌‌‌
 2.  అఫోన్సో పెన ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, బ్రెజిల్‌‌‌‌
 1. డాన్స్‌‌‌‌ లెచ్‌‌‌‌ వలెసా ఎయిర్‌‌‌‌పోర్టు, పోలండ్‌‌‌‌
 2. షెరెమెట్యెవో ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, రష్యా
 1. చాంగీ ఎయిర్‌‌‌‌పోర్టు, సింగపూర్‌‌‌‌
 2. రాజీవ్‌‌‌‌గాంధీ ఇంటర్నేషనల్‌‌‌‌  ఎయిర్‌‌‌‌పోర్టు, ఇండియా
 1. టెనెరిఫే నార్త్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, స్పెయిన్‌‌‌‌
 2. విరకొపొస్‌‌‌‌/కంపినాస్‌‌‌‌   ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, బ్రెజిల్‌‌‌‌

టాప్‌‌‌‌ 10 వరస్ట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టులు

 1. లిస్బన్‌‌‌‌ పొర్టెలా ఎయిర్‌‌‌‌పోర్టు, పోర్చుగల్‌‌‌‌
 1. కువైట్‌‌‌‌ ఇంటర్నేషనల్  ఎయిర్‌‌‌‌పోర్టు, కువైట్‌‌‌‌
 1. ఇంధొవెన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, నెదర్లాండ్స్‌‌‌‌

129. హెన్సీ కొవాండా ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, రొమేనియా

 1. మాల్టా ఇంటర్నేషనల్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, మాల్టా
 1. మాంచెస్టర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, యూకే
 1. పారిస్‌‌‌‌ ఓర్లీ ఎయిర్‌‌‌‌పోర్టు, ఫ్రాన్స్‌‌‌‌
 1. పోర్టో ఎయిర్‌‌‌‌పోర్టు, పోర్చుగల్‌‌‌‌
 1. బిల్లీ బిషప్‌‌‌‌ టొరంటో సిటీ ఎయిర్‌‌‌‌పోర్టు, కెనడా
 1. లండన్‌‌‌‌ గట్విక్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్టు, యూకే

Latest Updates