మ‌ద్యం వ్యాపారుల‌తో కుమ్మ‌క్కైన ఎస్సై స‌స్పెండ్

అక్ర‌మంగా మద్యం త‌ర‌లిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోకుండా వారితో కుమ్మ‌క్కైనందుకు ఓ ఎస్సై స‌స్పెన్ష‌న్ కు గుర‌య్యాడు. విధి నిర్వహణలో భాధ్యతారాహిత్యం గా వ్యవహరించినందుకు అత‌న్ని అధికారులు సస్పెండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పాల్మాకుల్ లో ఇటీవల లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మద్యం వ్యాపారులు రాత్రి పూట వైన్ షాపు ను ఓపెన్ చేసి అక్రమంగా మద్యం తరలించారు. అయితే రంగంలోకి దిగిన శంషాబాద్ ఎస్ఐ శ్రీధర్ మద్యం వ్యాపారుల పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారితో కుమ్ముక్కైనట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారం పై విచారణ చేపట్టిన సైబరాబాద్ కమీషనర్ సజ్జన్నార్ నిజమని తేలడంతో అతన్ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ కమీషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారు.

Shamshabad SI Sridhar has been suspended by higher authorities

Latest Updates