శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్‌లో గంధపు చెక్కలు పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న గంధపు చెక్కలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మస్కట్ మీదుగా ఖార్టూమ్ వెళ్తున్న ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్‌ అఫీషియల్స్ స్కానింగ్ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 114.25 కిలోల గంధపు చెక్కలను అధికారులు గుర్తించారు. సూడాన్‌ దేశానికి చెందిన సదరు ప్రయాణికుడ్ని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Latest Updates