కోహ్లీ సీక్రెట్ చెప్పిన షేన్ వార్న్

పింక్ లోకి మారిన రాజస్థాన్ రాయల్స్

కోహ్లీ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయర్లలో ఒకడు : వార్న్

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒకప్పటి కెప్టెన్.. ఆ తర్వాత మెంటర్ గా ఉంటూ వచ్చిన షేన్ వార్న్.. తాజాగా ఆ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. గతంలో మెన్ ఇన్ బ్లూ అనిపించిన రాజస్థాన్.. ఈసారి కలర్ మార్చింది. పింక్ కలర్ లోకి మారింది. పింక్ సిటీగా జైపూర్ నగరానికి పేరు.  ఈ జట్టుతో పదేళ్లుగా కలిసి నడుస్తున్న షేన్ వార్న్… తన అభిప్రాయాలను జాతీయ మీడియాతో పంచుకున్నాడు.

స్పిన్ దిగ్గజం షేన్ వార్న్… టీమిండియా స్కిప్పర్ విరాట్ కోహ్లీపై తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆల్ టైమ్ క్రికెట్ హిస్టరీలో బెస్ట్ ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ఒకడు అని షేన్ వార్న్ అన్నాడు. విరాట్ కోహ్లీ గొప్పతనాన్ని తాను స్వతహాగా చూశానని చెప్పాడు. విరాట్ కోహ్లీతో మాట్లాడుతుంటే తనకు రీఫ్రెషింగ్ గా అనిపిస్తుందని చెప్పాడు. కోహ్లీ నిజాయితీగా మాట్లాడతాడనీ… ఏ విషయమైనా కోహ్లీ ఓపెన్ గా చెబుతాడని తెలిపాడు షేన్ వార్న్.

2008 ఐపీఎల్ టోర్నీ విజేత రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించిన షేన్ వార్న్… ఆ జట్టును తాజా ఐపీఎల్ సీజన్ కోసం సిద్ధం చేస్తున్నాడు. వేటు కారణంగా రెండుసార్లు టోర్నీకి దూరంగా ఉంది. తాజాగా.. పదోసారి ఐపీఎల్ లో పాల్గొంటోంది. క్రికెట్ లో ఆస్ట్రేలియాలో ఎన్నో జట్లతరఫున ఆడాను కానీ.. జైపూర్ లో ప్రజలు చూపిస్తున్న ఆదరణ తనను ఇంకా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో నడిపిస్తోందని చెప్పాడు షేన్ వార్న్.

 

Latest Updates