షేన్‌ వార్న్‌కు డబ్బే డబ్బు!

మెల్‌ బోర్న్‌ : రాజస్థాన్‌ రాయల్స్‌ లో తనకు ఉన్న చిన్న వాటాతో పెద్ద మొత్తంలో డబ్బులు రానున్నాయని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌‌ షేన్‌ వార్న్‌ తెలిపాడు. 2008 ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌ లో వార్న్‌ కు రూ. 4 కోట్లు చెల్లించిన రాజస్థాన్‌ .. 0.75 వాటాను కూడా ఇచ్చింది. ‘ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పాకా ఫ్రాంచైజీ కోరిక మేరకు కెప్టెన్‌ గా, కోచ్‌ టీమ్‌ ను నడిపించాను. అప్పడు ఆ డీల్‌ లో భాగంగా నాకు వాటా ఇచ్చింది’ అని వార్న్‌ పేర్కొన్నాడు. ఇలా నాలుగేళ్ల పాటు ప్లే యర్‌‌గా ఆడిన ఈ లెజెండ్‌ స్పిన్నర్‌‌ వాటా ఇప్పుడు మూడు శాతానికి పెరిగింది. ప్రస్తుతం రాజస్థా న్‌ ఫ్రాంచైజీ విలువ రూ. 14 వేల కోట్లు (200 మిలియన్‌ డాలర్లు)గా ఉంది. మరో రెండు, మూడేళ్లలో ఇది డబుల్‌ కానుందని సమాచారం. అంటే 400 మిలియన్‌ డాలర్లలో మూడు శాతం వాటా అంటే దాదాపు 12 మిలియన్‌ డాలర్లు (రూ. 85కోట్లు ) వార్న్‌ కు దక్కనున్నాయి.

Latest Updates