ఆస్ట్రేలియా క్రికెటర్ల సంఘం అధ్యక్షుడిగా షేన్ వాట్సన్

ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన వాట్సన్ లీగ్ ల్లో సత్తా చాటడం ద్వారా అభిమానులను అలరించాడు. బ్యాట్ తోనే కాదు బంతితోనూ అనేకసార్లు తన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఆల్ రౌండర్ ను ఇప్పుడో విశిష్ట పదవి వరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ లో కీలక పాత్ర పోషించే ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ACA) అధ్యక్షుడిగా షేన్ వాట్సన్ నియమితుడయ్యాడు.

నిన్న(సోమవారం) రాత్రి జరిగిన ACA వార్షిక సర్వసభ్య సమావేశంలో వాట్సన్ నియామకాన్ని ప్రకటించారు. అంతేకాకుండా, ACA బోర్డు సభ్యుల సంఖ్యను 10కి పెంచారు. కొత్తగా ACA బోర్డులో ఆసీస్ ఆటగాళ్లు పాట్ కమ్మిన్స్, క్రిస్టెన్ బీమ్స్ తో పాటు మహిళా క్రికెట్ వ్యాఖ్యా లిసా స్థాలేకర్ కు స్థానం కల్పించారు. ఆస్ట్రేలియాలో క్రికెటర్ల హక్కులు కాపాడడంలో, క్రికెట్ బోర్డుకు ఆటగాళ్లకు మధ్యవర్తిలా వ్యవహరించడంలో ACA కీలకపాత్ర పోషిస్తోంది.

Latest Updates