సాహో నుంచి తప్పుకున్న ‘శంకర్ ఎహసాన్ లాయ్’

‘ప్రభాస్’ సాహో ఫస్ట్ పోస్టర్ చూసినప్పుడు అనుకున్నదే నిజం అయింది. మొన్నామధ్య సాహో ఫస్ట్ లుక్ పోస్టర్ లో మూవీ టీమ్ పేరులో సంగీత దర్శక త్రయం శంకర్ -ఎహసాన్ -లాయ్ పేరు లేదు. వీరి పేర్లు ఎందుకు వేయలేదో చాలామందికి అర్థం కాలేదు. ఇవాళ మే 27న విడుదలైన సెకండ్ పోస్టర్ లోనూ ఆ పేరు మిస్సయింది. చివరకు అభిమానుల అనుమానమే నిజం అయింది. సాహో సినిమా టీమ్ నుంచి ‘శంకర్ ఎహసాన్ లాయ్’ ట్రియో తప్పుకుంది.

ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ – సాహోకు సంబంధించిన ఏ అప్ డేట్ అయినా.. భారతీయ సినిమా పరిశ్రమలో ఓ సంచలనంగా, హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటులు, టెక్నీషియన్లు , హాలీవుడ్ స్థాయి టెక్నాలజీతో ఈ మూవీ రూపొందుతోంది. శంకర్ -ఎహసాన్ -లాయ్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఏమైందో ఏమో గానీ.. మూవీ నుంచి తప్పుకుంటున్నట్టు టీమ్ ప్రకటించింది. ప్రభాస్, సుజీత్, వంశీ, ప్రమోద్, శ్యామ్ లకు ఆల్ ద బెస్ట్ చెప్పారు.

శంకర్ మహదేవన్- ఎహసాన్ నూరానీ – లాయ్ మెండోన్సా ట్రియో.. సాహోకు పాటలు కంపోజ్ చేశారు. ఈ పాటలు త్వరలోనే విడుదల కావాల్సి ఉంది. ఈ టీమ్ తప్పుకోవడంతో.. పాటల విడుదల ఆలస్యం అవుతుందని.. సినిమా రిలీజ్ లేట్ అవుతుందన్న వార్తలు మొదలయ్యాయి. ఐతే… అలాంటిదేమీ లేదనీ.. పాటల పని పూర్తయిందని.. ఆడియో రిలీజ్, మూవీ రిలీజ్ చెప్పిన టైమ్ కే జరుగుతాయని సినిమా యూనిట్ చెబుతోంది.

సాహో రీ-రికార్డింగ్ వేరే సంగీత దర్శకుడితో చేయిస్తారని తెలుస్తోంది. తమన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. సాహో చాప్టర్ 1 వీడియోకు తమన్ బీజీఎం ఇచ్చాడు. సాహో చాప్టర్ 2 కు జిబ్రాన్ మ్యూజిక్ ఇచ్చాడు.

Latest Updates