భువీ ప్లేసులో శార్ధూల్ ఠాకూర్

వెస్టిండీస్‌ పై టీ20 సిరీస్‌ గెలిచిన ఇండియాకు వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు గట్టిషాక్ తగిలింది. గజ్జలో గాయం కారణంగా భువీ వన్డేలకు దూరం కానున్నాడని సమాచారం. భువీ గాయంపై అధికారిక ప్రకటన లేనప్పటికీ అతని స్థా నంలో శార్ధూ ల్‌‌ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే చాన్స్‌‌ అధికంగా ఉంది. వరల్డ్‌‌కప్‌ సమయంలో తొడ కండరాల సమస్యతో ఇబ్బంది పడిన భువీ.. ఆ తర్వాత జరిగిన సౌతాఫ్రికా, బంగ్లా దేశ్‌ సిరీస్‌ కు దూరమయ్యాడు. విండీస్‌ తో జరిగిన టీ20 సిరీస్‌ తో టీమ్‌ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మరోసారి గాయపడడంతో భువీ కెరీర్‌ కు ఇది ఎదురుదెబ్బ కానుం ది. ఇక సెప్టెంబర్‌ లో జరిగిన ఆసియాకప్‌ లో చివరిగా వన్డే ఆడిన శార్ధూల్ ఠాకూర్‌ .. అక్టోబర్‌ లో వెస్టిండీస్‌ పై టెస్ట్‌‌ల్లో అరంగేట్రం చేశాడు. కాగా, మోకాలి గాయంతో శిఖర్‌ ధవన్‌‌ ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు.

Latest Updates