జీవితాలను మార్చిన ఉత్తేజకరమైన కథలను షేర్‌‌ చేయండి: మోడీ

  • మన్‌ కీ బాత్‌ కోసం పిలుపునిచ్చిన మోడీ

న్యూఢిల్లీ: ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్‌ కీ బాత్‌ కోసం కొందరి జీవితాలను ప్రభావితం చేసిన ఉత్తేజకరమైన కథలను షేర్‌‌ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. “ సామూహిక ప్రయత్నాలు, సానుకూల మార్పులను తీసుకొచ్చిన స్ఫూర్తి నింపే కథల గురించి కచ్చితంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అనేక జీవితాను మార్చిన కథల గురించి మన్‌ కీ బాత్‌ కోసం షేర్‌‌ చేయండి” అని మోడీ ట్వీట్‌ చేశారు. నమో యాప్‌ ద్వారా లేదా మై జీవోవీ వెబ్‌సైట్‌ ద్వారా షేర్‌‌ చేయాలని కోరారు. ఈ నెల 26న మన్‌కీ బాత్‌ జరగనుంది. పోయిన నెల మన్‌ కీ బాత్‌లో మోడీ జవాన్ల గురించి మాట్లాడారు. వారి ధైర్య సాహసాలు అద్భుతం అని ఆయన అన్నారు.

Latest Updates