భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

స్టాక్  మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. లాస్ట్ వీకెండ్ లో రికార్డుల లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు…. ఈ వారం ప్రారంభంలోనూ  అదే ఊపులో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 728 పాయింట్లు, నిఫ్టీ 350  పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో సెన్సెక్స్  39 వేలను దాటింది. కార్పొరేట్  పన్ను కోతతో గత వారాంతంలో అన్ని రంగాల షేర్లలో  భారీగా కొనుగోళ్లు జరిగాయి.

బ్యాంకింగ్ , ఆటో ఇన్ ఫ్రా  సెక్టార్లు భారీగా లాభపడుతున్నాయి. హోటళ్లపై జీఎస్ టీ తగ్గింపుతో ఆ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫార్మ, ఐటీ సెక్టార్లు నష్టపోతున్నాయి. ఎల్  అండ్  టీ, ఐటీసీ, ఇండస్  ఇండ్ ,  ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఅండ్ ఎం, ఏషియన్  పెయింట్స్,  ఓఎన్ జీసీ, మారుతి సుజుకి టాప్  గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

Latest Updates