కథ లేదన్నది నిజమే! : శర్వా

మూస ధోరణిలో ముందుకెళ్లడం కంటే ప్రతి సినిమాకీ వైవిధ్యంగా ప్రయత్నించడమే ఇష్టం అంటున్నాడు శర్వానంద్. తాజా చిత్రం ‘రణరంగం’కి, అందులోని తన పాత్రకి లభిస్తోన్న స్పందన గురించి శర్వా చెప్పిన విశేషాలు.

స్క్రీన్ ప్లే, సుధీర్ మేకింగ్ స్టైల్ నచ్చి ఈ సినిమా చేశాను. రెండు వేరియషన్స్ ఉన్న క్యారెక్టర్. ఇంతటి యాక్షన్ మూవీ నేనెప్పుడూ చేయలేదు. చాలెంజింగ్​గా ఉంటుందనిపించింది. చాలా బాగా చేశావ్ అంటున్నారంతా. నటుడిగా ఈ పాత్ర పోషించినందుకు వెరీ హ్యాపీ. సురేఖ ఆంటీ (చిరంజీవి భార్య) ఫోన్ చేసి చాలా అందంగా ఉన్నావు, ఎనభైల్లో గెటప్ బాగుంది అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. నాక్కూడా ఆ యంగ్ గెటప్ ఇష్టం. చిరంజీవి గారి అభిమానిగా కనిపించేందుకు అప్పటి మేనరిజమ్స్ కొంత ప్రయత్నించాను. గ్యాంగ్‌‌స్టర్ రోల్ కోసమైతే కొత్తగా కష్టపడ్డదేమీ లేదు. గెటప్ వేయగానే ఆ హుందాతనం వచ్చేసింది.             మార్నింగ్ షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీ పర్లేదన్నారు. ఫష్ట్  షోకి యావరేజ్ అన్నారు. ఇప్పుడు అబౌ యావరేజ్ దగ్గర ఆగింది. నిజానికి ఇంకా బెటర్ రిజల్ట్ ఊహించాం. అనుకున్న స్థాయి ఫలితమైతే రాలేదు. అలాగని ఆడియెన్స్ ఎవరూ బాలేదని కూడా అనలేదు. అందుకు సంతోషంగా ఉంది.

రివ్యూస్​లో కథ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. అది నిజమే. కొత్త కథ ప్రయత్నిద్దామనో, మెసేజ్ ఇద్దామనో ఈ సినిమా చేయలేదు. స్క్రీన్ ప్లే బేస్డ్‌‌, స్టైలైజ్‌‌డ్‌‌ సినిమా చేద్దామనుకుని తీశాం. ప్రేక్షకులకు అది నచ్చుతుందేమో, వెరైటీగా ఉంటుందేమో అనుకున్నాం. కానీ కొన్ని బ్యాక్ ఫైర్ అయ్యాయి. కొన్ని కలిసొచ్చాయి. ప్రేక్షకుల స్పందన ఒకలా ఉంది. రివ్యూస్ మాత్రం మరోలా ఉన్నాయి. ఈ సినిమా నేను చేయడం తప్పా ఒప్పా అనే కన్ఫ్యూజన్‌‌లో ఉన్నాను. వసూళ్లు సినిమా విజయాన్ని నిర్ణయిస్తాయని భావిస్తున్నాను. కానీ రివ్యూ చేసినవాళ్లు కూడా కాస్త కనికరించి ఉంటే కలెక్షన్స్ మరింత బాగుండేవేమో అని ఆశ.

‘శ్రీకారం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. అద్భుతమైన కథ. కమర్షియల్‌‌గా ఎంత వర్కవుటవుతుందో తెలీదు కానీ ఆ కథ అందరికీ తప్పకుండా నచ్చుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. తెలుగు, తమిళ భాషల్లో ఒక చిత్రం చేస్తున్నాను. ‘96’ మూవీ చిత్రీకరణ రీమేక్ సగానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. నేను ఒక జానర్‌‌‌‌కి ఫిక్స్ అవను. ఎప్పటికప్పుడు మారుస్తుంటాను. నేను చేసే ప్రతి స్క్రిప్ట్ దేనికదే వైవిధ్యం. దేనికదే ప్రత్యేకమైన జానర్. ఒక మూసలో కొనసాగితే నన్ను చూడటానికే బోర్ కొట్టేస్తుంది. శర్వా సినిమా అంటే మంచి కథ ఉంటుందని అందరూ అంచనా వేస్తారు. కాకపోతే ఇందులో అది మిస్ అయింది.

Latest Updates