శర్వా బర్త్ డే..కొత్త సినిమా లుక్ అదిరింది

హీరో శర్వానంద్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా లుక్ ను ఇవాళ రిలీజ్ చేసింది యూనిట్. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ సంస్థ శర్వానంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. గ్రే హెయిర్ లుక్‌తో స్టెలిష్‌ గా కనిపిస్తున్న శర్వా స్టిల్ ఒకటి సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. శర్వా నయా లుక్ ఇపుడు ఆన్‌ లైన్‌ లో వైరల్‌గా మారింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ కు సంబంధించి త్వరలోనే ప్రకటన ఉంటుందని సితార ఎంటర్‌ టైన్ మెంట్స్ తెలిపింది. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుపుకుంటోంది.  శర్వానంద్ 27వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టు మేలో విడుదల కానుంది. పడిపడి లేచె మనసు తర్వాత శర్వానంద్ నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌ డేట్స్ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. లుక్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

Latest Updates