ఓల్డ్ స్టోరీ.. న్యూ హీరో

సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఒక కథ ఎంతమంది హీరోల చుట్టూ తిరుగుతుందో చెప్పలేం. సినిమా అనౌన్స్ చేసి, షూటింగ్ మొదలుపెట్టి ఆగిపోయిన సినిమాల కథలు కూడా మరో హీరో వద్దకు వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. శర్వానంద్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 2017లో దర్శకుడు కిషోర్ తిరుమల, వెంకటేష్ కాంబోలో ‘ఆడవాళ్లూ.. మీకు జోహార్లు’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు ఇదే కథకు శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మేకర్స్ కూడా అదే టైటిల్​తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు.

తన ప్రతి సినిమా డిఫరెంట్​గా ఉండేలా ప్లాన్ చేసుకునే శర్వా… ప్రస్తుతం ‘శ్రీకారం’ చిత్రంలో రైతుగా నటిస్తున్నాడు. కిషోర్ రెడ్డి అనే షార్ట్ ఫిల్మ్ మేకర్‌‌‌‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తై రిలీజ్​కి రెడీ అవుతోంది. తర్వాత ‘ఆర్ఎక్స్100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’మూవీకి ఓకే చెప్పాడు. వీటితోపాటు నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన కిశోర్ తిరుమల సినిమాకి కమిట్ అయ్యాడు. రామ్ హీరోగా కిశోర్ తీసిన ‘రెడ్’ మూవీ రిలీజ్ అవ్వగానే శర్వానంద్ మూవీ కోసం వర్క్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది.

Latest Updates