రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది

ప్రేమ్ కుమార్ డైరెక్షన్ యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా నటించిన సినిమా జాను. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రమోషన్స్ స్పీడప్ చేస్తుంది. ఈ క్రమంలోనే బుధవారం జాను అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది యూనిట్. 2 నిమిషాల 17 సెకన్లున్న ఈ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. శర్వానంద్  డైలాగ్స్ తో ప్రారంభమైన ట్రైలర్ లో..”ఎగిసిపడే కిరటాల్లో ఎదురుచూసే సముద్ర తీరాన్ని నేను. పిల్లగాలి కోసం ఎదురుచూసే నల్లమబ్బులా..ఓర చూపు కోసం.. నీ దోర నవ్వు కోసం.. రాత్రంతా చుక్కలు లెక్కపెడుతుంది నా హృదయం. నా వైపు నీ చూపు అప్పు ఈయలేవా”. అనే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

“ ఒక్కోసారి జీవితంలో ఏమీ జరగకపోయినా..ఏదో జరగపోతుందని మనసుకి మాత్రం ముందే తెలుస్తుంది” అని సమంత అంటుంది. ట్రైలర్ చూస్తుంటే చిన్ననాటి లవ్ స్టోరీలా కనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇప్పటికే రిలీజైన మూవీ స్టిల్స్ ఆకట్టుకోగా ఇవాళ వచ్చిన ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచిందంటున్నారు ఫ్యాన్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే.

సూపర్ ఓవర్ లో కివీస్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

see also : లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ

 

Latest Updates