శశాంక్‌ ఇకపై ఐసీసీ మాజీ చైర్మన్‌

దుబాయ్‌ : ఇంటర్నే షనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌ కౌన్సి ల్‌‌‌‌‌‌‌‌(ఐసీసీ ) తొలి ఇండిపెం డెంట్‌ చైర్మన్‌ గా ఘనత సాధించి న శశాంక్‌ మనోహర్ ‌‌‌‌‌‌‌‌(62) బుధవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్‌ గా ఉన్న ఇమ్రాన్‌ ఖవాజ తాత్కాలిక చైర్మన్‌గా బాధ్యతలు నిర్వరిస్తారని ఐసీసీ బుధవారం ప్రకటించింది. 2008–11 వరకు బీసీసీఐ ప్రెసిడెంట్‌ గా ఉన్నశశాం క్‌ .. 2015 నవంబర్‌‌‌‌‌‌‌లో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రెండుసార్లు తన రెండేళ్ల పదవీకాలాన్నీ పూర్తి చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఇంకో రెండేళ్లు శశాంక్‌కు చైర్మన్‌గా కొనసాగే అవకాశమున్నా అందుకు ఆయన నిరాకరించారు. కొత్త చైర్మన్‌ ఎన్నిక అంశంపై ఐసీసీ బోర్డు వారం రోజుల్లో పు నిర్ణయం తీసుకోనుంది.

Latest Updates