ప్రజా దృష్టిని మరల్చడానికి మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని దీటుగా ఎదుర్కోవడంలో కేంద్ర సర్కార్ విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ దుయ్యబట్టారు. ఎకానమీని హ్యాండిల్ చేయడంలోనూ మోడీ సర్కార్ ఫెయిలైందన్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మీడియాను ఆయుధంలా వాడుకుంటోందని ఆరోపించారు. ‘మనం రెండు చెత్త ప్రపంచాల్లో ఉన్నాం. కరోనా వ్యాప్తిని నిలువరించలేకపోయాం. అదే సమయంలో ఎకానమీ పడిపోవడాన్నీ ఆపలేకపోయాం. గత 41 ఏళ్లలో మొదటిసారిగా జీడీపీ కుంచించుకుపోయింది. ఎన్నడూ లేని విధంగా చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు సర్వనాశనమం అయ్యాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువవుతున్న సమయంలో రాహుల్ గాంధీ లాంటి కొందరి సూచనలు పరిగణనలోకి తీసుకుంటే పరిస్థితి మరీ ఇంత దిగజారేది కాదు’ అని థరూర్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యం సమస్య తీవ్రతను, నిర్లక్ష్యలేమిని, ప్రజా గొంతుకలను వినని అహంకార ధోరణి చూపించిందన్నారు.

Latest Updates