కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ప్రియాంక సరైన వ్యక్తి: శతృఘ్న సిన్హా

కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ప్రతిపాదిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ నేత శతృఘ్న సిన్హా మాట్లాడుతూ..పార్టీ అత్యున్నత పదవిలో ప్రియాంక గాంధీ అయితే ఒదిగిపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర బాధితులను పరామర్శించే విషయంలో ప్రియాంక చూపిన తెగువ ప్రశంసనీయమన్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో ఆమెను మాజీ ప్రధాని ఇందిరా గాంధీతో పోల్చారు. దీంతో పార్టీని ముందుకు నడపడానికి గల సామర్థ్యం ఆమెలో ఉందన్నారు. గాంధీ కుటుంబేతర సభ్యులు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టినట్లయితే పార్టీ 24 గంటల్లో చీలిపోతుందని పలువురు నాయకులు భావిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేశారు.

Latest Updates