ఉమెన్ ఆన్ వీల్స్.. షీ క్యాబ్స్​

  •                 మొదటి విడతగా సిటీలో నాలుగు లాంచ్

అవకాశాలు ఇస్తే మహిళలు అద్భుతంగా రాణిస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళల కోసం, వారి సేఫ్టీ, సెక్యూరిటీ దృష్ట్యా యోషా దిథితి ఫౌండేషన్ ఉమెన్ ఆన్ వీల్స్(వావ్) ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొదటి విడత లో నాలుగు షీ క్యాబ్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం బంజారాహిల్స్ లోని ముఫ్కంజా కాలేజ్ గ్రౌండ్స్ లో మంత్రి సత్యవతి రాథోడ్ వీటిని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ మాట్లాడుతూ ఉమెన్ ఆన్ వీల్స్ షీ క్యాబ్స్ ని మహిళలు ఈజీ కమ్యూట్ అనే యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.  ఈ షీ క్యాబ్స్ హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ఫౌండేషన్ నిర్వాహకురాలు జోత్స్నా అంగారా తెలిపారు.

Latest Updates