ఆకతాయిలకు చెక్‍ పెడుతున్న షీ టీమ్స్

వెలుగు: అమ్మాయిలను వేధిస్తున్నఆకతాయిలకు సిటీ షీటీమ్స్ చెక్ పెడుతున్నాయి. సోషల్ మీడియా, హాక్ ఐ, ఈ మెయిల్స్ నుంచి తమకు వచ్చే కంప్లైంట్స్ తో యాక్షన్ తీసుకుంటున్నాయి. ఈ నెలలో షీటీమ్స్ కు శుక్రవారం వరకు 113 ఫిర్యాదులు అందాయి. ఇందులో60 మంది బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయగా 43 కంప్లైంట్స్ వాట్సాప్, 6 ఈ మెయిల్పిటీషన్స్, హాక్ ఐ నుంచి మరో 3 ఫిర్యాదులు పోలీసులకు అందాయి. 12 మంది నిందితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరో ఆరుగురిపై పిటీ కేసులు, 9మందిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదుచేసిన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇందులోబోరబండ రైల్వేస్టేషన్ వద్ద బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోక్సో చట్టం కింద షీటీమ్‌ కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్ చేసింది.

సికింద్రాబాద్ కు చెందిన బాధితురాలిని వేధింపులకు గురిచేసిన యువకునికి 13స్పెషల్ఎంఎం కోర్ట్ ఆరు రోజుల జైలు శిక్ష విధించింది. బాధితురాలిని అసభ్యకర మెసేజ్ లతో వేధిస్తున్న కె.యశ్వం త్(19)కు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. మరో కేసులో కరీంనగర్ కు చెందిన ఆండ్రస్ రాకేష్(25) అనే కార్ డ్రైవర్కు 11వ స్పెషల్ ఎంఎం కోర్ట్ రెండు రోజుల జైలుశిక్షతో పాటు జరిమానా విధించింది. బాధితురాలిని ప్రేమ పేరుతో వేధిస్తున్న రమేష్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ షీ టీమ్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేసింది . యువతులను ఫోన్ కాల్స్ తో వేధిస్తున్నముగ్గురి కి రెండు రోజుల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ స్పె షల్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది .

Latest Updates